ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ‘సినిమా ‘మార్కో’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ ‘మార్కో 2’ సినిమా సెకండ్ పార్ట్‌లో విలన్‌గా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజంతో తెలియాల్సి ఉంది. సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగులో మార్కోకు మంచి స్పందన వస్తోంది. విడుదలైన మూడో వారంలో ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.