Homeహైదరాబాద్latest Newsఏదైనా చాన్స్ ఉందన్న స్టార్ హీరో..! చెప్పుతో కొడతా.. అంటూ ఖుష్బూ వార్నింగ్

ఏదైనా చాన్స్ ఉందన్న స్టార్ హీరో..! చెప్పుతో కొడతా.. అంటూ ఖుష్బూ వార్నింగ్

నటి ఖుష్బూ ఓ హీరో తనని లైంగిక వేధింపుల గురి చేసాడుని సంచలన వ్యాఖ్యలు చేసింది.గోవాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ‘ఉమెన్ సేఫ్టీ అండ్ సినిమా’ అనే అంశంపై మాట్లాడిన ఖుష్బూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా షూటింగ్ సమయంలో ఒక హీరో తనతో చాలా ఇబ్బందికరంగా మాట్లాడారని.. తనకు ఏదైనా చాన్స్ ఉందా? అని అడిగారని వెంటనే సర్ నా చెప్పు సైజ్ 41, మీరు ఇక్కడ చెప్పు దెబ్బ తింటారా లేక యూనిట్ అందరి ముందు తింటారా అని జవాబు ఇచ్చినట్టు చెప్పారు. అయితే మీరు ఏదైనా తప్పుగా భావించినప్పుడు వెంటనే స్పందించాలని ఆమె మహిళలను కోరారు. ఇటీవల హేమ కమిటీ నివేదిక మలయాళ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ నివేదిక సినిమా షూటింగ్‌లో మహిళల భద్రతపై సందేహాలు లేవనెత్తింది. తాజగా నటి ఖుష్బూ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img