జనరల్ డెస్క్ : రాబోయే రోజుల్లో ఎన్నో యూనికార్న్‌లు, డెకాకార్న్‌లకు భారత్ వేదిక అవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంకురాల అభివృద్ధి, వ్యాపార ఆలోచనలపై మేథోమథనం కార్యక్రమంలో భాగంగా దిల్లీలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ వేదికగా ఆయన మాట్లాడారు.
భారత్ వినూత్న రీతిలో అభివృద్ధి దిశగా పురోగిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం వినూత్న అవకాశాలు వృద్ధి చెందుతున్నాయని, స్టార్టప్ కల్చర్ పెరుగుతోందని ప్రధాని వివరించారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రమని, దేశంలో 1.25 లక్షలకు పైగా నమోదిత స్టార్టప్‌లున్నాయన్నారు. స్టార్టప్‌ల్లో 12 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారని ప్రధాని పేర్కొన్నారు.