Homeతెలంగాణస్టార్టప్ యాస్పైరింగ్ లీడర్స్ కేటగిరీలో తెలంగాణకు టాప్ ర్యాంకు

స్టార్టప్ యాస్పైరింగ్ లీడర్స్ కేటగిరీలో తెలంగాణకు టాప్ ర్యాంకు

న్యూఢిల్లీః స్టార్టప్ ఇండియా 2019 రాష్ట్రాల ర్యాంకుల్ని కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. మొత్తం ఐదు కేటగిరీల కింద రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. స్టార్టప్ యాస్పైరింగ్ లీడర్స్ కేటగిరీలో తెలంగాణ మొద‌టి స్థానం దక్కించుకుంది. తెలంగాణ త‌ర్వాత ర్యాంకుల్లో హర్యానా, నాగాలాండ్, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లు నిలిచాయి. ఎమర్జింగ్ స్టార్టప్ ఈకో సిస్టం కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది. ఏపీ తర్వాత ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, తమిళనాడు, అసోం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లకు స్థానాలు దక్కించుకున్నాయి. బెస్ట్ ఫెర్ఫామర్లగా అండమాన్ నికోబర్ దీవులు, గుజరాత్‌లు నిలివ‌గా.. టాఫ్ ఫెర్ఫామర్లగా కర్ణాటక, కేరళలకు ర్యాంకులు ద‌క్కించుకున్నాయి. ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్‌ ప్రకటించగా ఇందులో ఏపీ టాప్‌లో నిలిచింది. తెలంగాణ మూడో ర్యాంకు సాధించింది.. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకు దక్కించుకున్న విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img