Homeఆంధ్రప్రదేశ్వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన‌సాగుతున్న‌ రాష్ట్ర బంద్

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన‌సాగుతున్న‌ రాష్ట్ర బంద్

State bandh continues against privatization of Vizag steel plant

Workers are demanding that the Visakhapatnam steel plant not be privatized but should remain in the public sector.

Several associations continue to raise concerns jointly in the name of the Steel Plant Conservation Committee.

As part of the agitation, public associations are staging protests in various parts of the country, including Visakhapatnam.

As a follow-up to these, the AP called for a bandh on Friday.

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి పేరుతో పలు సంఘాలు సంయుక్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

ఆందోళనల్లో భాగంగా విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో పలురూపాల్లో ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

వీటికి కొనసాగింపుగా శుక్రవారం ఏపీ బంద్‌కి పిలుపునిచ్చారు.

సర్కారు తరఫున ఆర్టీసీ బంద్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్‌కి ఏపీ ప్రభుత్వం తరఫున మద్ధతు ఇస్తున్నామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు.

బంద్‌కు సంఘీభావంగా ఆర్టీసీ బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఆ తర్వాత బస్సులను అడ్డుకోకుండా ఆందోళనకారులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని మంత్రి ప్రకటించారు.

“వ్యాపారం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ, ప్రతి వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే ధరలను కంట్రోల్ కష్టం.

ప్రజలకు అవసరమైనవి కొన్ని కచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలన్నది మా ప్రభుత్వ విధానం.

విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో ఉంటే, దాని నుంచి బయటపడే మార్గాలను ఇప్పటికే సీఎం జగన్ సూచించారు.” అన్నారు మంత్రి పేర్ని నాని.

పరిరక్షణ సమితి ఆందోళనలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి పేరుతో విశాఖలో గడిచిన పక్షం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి.

ప్లాంట్ వద్ద నిర్వహించిన బహిరంగసభకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలతోపాటు వామపక్షాలు, కాంగ్రెస్‌ సహా వివిధ సంఘాలు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా రాస్తారోకోలు జరుగుతున్నాయి.

వాటికి కొనసాగింపుగా జరుగుతున్న బంద్ కార్యక్రమం రాష్ట్రమంతా విశాఖ ఉక్కు ఉద్యమానికి తోడ్పడుతుందని పరిరక్షణ సమితి నేతలు బీబీసీతో అన్నారు.

బంద్‌కు ప్రజల నుంచి మద్ధతు లభిస్తోందని సమితి ప్రతినిధి జె.అయోధ్యరామ్‌ అన్నారు.

‘‘ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వ్యాపార సంస్థలు మూసివేతకు పిలుపునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు.

ప్రభుత్వ రవాణాను కూడా నిలిపివేస్తున్నారు. బంద్‌ సంపూర్ణంగా జరగబోతోంది.’’ అని ఆయన అన్నారు.

టీడీపీ మద్దతు

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాల బంద్ పిలుపుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. “తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడతాం.

స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదం.’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విశాఖలో పర్యటించారు.

బీజేపీ ఏమంటోంది?

శుక్రవారం బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా వివిధచోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

శుక్రవారం ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

అయితే ఏపీ బంద్‌ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.

విశాఖ ఉక్కు కార్మికుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు.

కార్మికులను రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

“ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం. ఉద్యోగులకు ఎటువంటి సమస్య రాదు.

బంద్, ఇతర నిరసనలతో ఒరిగేదేమీ ఉండదు.

ఇలాంటి ఆందోళనలు రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు వేసే ఎత్తుగడలు మాత్రమే” అని నరసింహారావు వ్యాఖ్యానించారు.

జనసేన వైఖరేంటి?

బీజేపీ, జనసేన మినహా మిగిలిన అన్నిపార్టీలు బంద్‌కి సంఘీభావం ప్రకటించాయి. వివిధ వ్యాపార,వాణిజ్య సంఘాలు కూడా మద్ధతు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img