ఇదేనిజం, లక్షెట్టిపేట: ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల కుమ్రం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేటికీ గిరిజన, ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి, అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెట్టెం శ్రీనివాస్, మెట్టుపల్లి వెంకటేష్, కిషన్, కౌన్సిలర్ లావుడ్యా సురేష్ నాయక్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ మండల అధ్యక్షులు దొంత నర్సయ్య, మండల అధ్యక్షులు రాందాస్, పట్టణ అధ్యక్షులు తొగరు రాజు, ఉపాధ్యక్షులు బిరుదుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, నాయకులు భైరం శ్రీనివాస్, అడ్వకేట్ రాజేష్ తదితరులు పాల్గోన్నారు.