హైదరాబాద్ : కేజ్రీవాల్ అరెస్టును సమర్థిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిల్లీలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందన్నారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కవిత అరెస్టుకు స్పందించని కేసీఆర్, కేజ్రీవాల్ అరెస్టుపై మాట్లాడటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.