Homeఫ్లాష్ ఫ్లాష్Steps towards Kavitha's arrest? కవిత అరెస్ట్​ వైపు అడుగులు?

Steps towards Kavitha’s arrest? కవిత అరెస్ట్​ వైపు అడుగులు?

– తాజాగా ఢిల్లీ ఎంపీ ఇంట్లో ముమ్మర సోదాలు
– ఇప్పటికే అప్రూవర్లుగా పలువురు నిందితులు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: లిక్కర్​ స్కామ్​ కేసులో ఈడీ మరోసారి దూకుడు పెంచింది. దీంతో ఈ కేసులో కవిత అరెస్ట్​ కాబోతున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులు అప్రూవర్లుగా మారారు. మరోవైపు ఈ కేసులో అరుణ్​ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్​ గా మారినట్టు వార్తలు వచ్చాయి. ఆయన తొలుత అప్రూవర్​ గా మారడం.. ఆ తర్వాత మళ్లీ తాను మారలేదని అధికారుల ఒత్తిడితోనే అప్రూవర్ గా మారినట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో కవితను కూడా అరెస్ట్​ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సౌత్​ గ్రూప్​ కు కీలకంగా వ్యవహరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. కవితపై కూడా చర్యలు తీసుకోబోతున్నారన్న అంశం తాజాగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని జోరుగా ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. పలువురు నేతలు పార్టీని వీడేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కవితను అరెస్ట్​ చేస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కవిత అరెస్ట్​ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img