దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది. మధ్యాహ్నం 12:18 గంటల సమయంలో సెన్సెక్స్ 486 పాయింట్లు పుంజుకొని 74,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 22,657 దగ్గర కొనసాగుతోంది.