stock market : దేశీయ స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలను చవిచూశాయి.ఉదయం 80,058.43 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ (గతంలో 80,116.49 వద్ద ముగిసింది) రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,724.55 కనిష్ట స్థాయిని తాకిన ఇండెక్స్ చివరకు 315 పాయింట్లు తగ్గి 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 82 పాయింట్లు తగ్గి 24,246 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్ గా ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా మరియు సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. టాప్ లూజర్స్ గా హిందూస్తాన్ యూనిలీవర్, భారతి ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎటర్నల్, మహీంద్రా & మహీంద్రా షేర్లు నష్టపోయాయి.