అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం ఆరంభంలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు కుంగి 77,218 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 23,480 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.