దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్ల నష్టంతో 81,207 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు కోల్పోయి 24,740 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.