దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 79,065.22 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. రోజంతా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. చివరికి 149.85 పాయింట్ల లాభంతో 79,105.88 వద్ద ముగిసింది. నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభపడి 24,143.75 వద్ద స్థిరపడింది. కాగా అమెరికా ఎకనామిక్ డేటా పాజిటివ్‌గా రావడంతో ప్రపంచ మార్కెట్లలో కొంత సానుకూలత నెలకొంది.