దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వరుసగా మూడోరోజూ లాభాల్లో స్థిరపడ్డాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఎల్‌అండ్‌టీ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభంతో 24,457.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది.