Stock market: ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 744 పాయింట్లు క్షీణించి 75,551 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు పడిపోయి 22,958 వద్ద ముగిశాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా తదితర షేర్లు నష్టాల్లో ఉండగా, HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు లాభడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.99గా ఉంది.