Homeహైదరాబాద్latest NewsStock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 915 పాయింట్లు లాభపడి 79,675 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,326 వద్ద ట్రేడవుతోంది. నెస్లే ఇండియా మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. టాటా మోటార్స్‌, మారుతీ, ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img