దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 269.95 పాయింట్ల నష్టంతో 24,530.90 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లపై ఒత్తిడి కనిపించింది.