సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, మారుతీ, ICICI బ్యాంక్, NTPC, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సన్ ఫార్మా, TCS, L&T, నెస్లే ఇండియా, పలు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.