దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 74,773 వద్ద.. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకొని 22,717 దగ్గర ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో.. హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.