దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,850 వద్దకు చేరింది. సెన్సెక్స్ 785 పాయింట్లు ఎగబాకి 75,168 వద్ద ముగిసింది. HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, SBI, ఇన్ఫోసిస్, TCS, ఎల్ అండ్ టీ, NTPC, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ లాభపడ్డాయి. HUL, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.