Stock market : నేడు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈరోజు సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 77,389 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు కోల్పోయి 23,440 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 30లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాలతో ముగిశాయి.బీఎస్ఈ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ 2.85 శాతం నష్టపోయింది.