దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి 80.502 దగ్గర ముగియగా.. నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 24,509 దగ్గర స్థిరపడింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ షేర్లు లాభపడగా.. విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి.