సోమవారం ముంబైలో లోక్‌సభ ఎన్నికల కారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కమోడిటీ, బులియన్ మార్కెట్లు కూడా పనిచేయవు. మంగళవారం నుంచి స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లకు శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు. ఇందులో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 74 వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 22,500 మైలురాయి పైన స్థిరపడింది. మొత్తం రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించగా.. ఇందులో సెన్సెక్స్ 88.91 పాయింట్లు లాభపడి 74,005.94 వద్ద, నిఫ్టీ 35.9 పాయింట్ల లాభంతో 22,502 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.