స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 368 పాయింట్లు లాభపడి 78,507కు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,742 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా మారుతీ (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.45%), బజాజ్ ఫైనాన్స్ (1.69%), ఎల్ అండ్ టి (1.64%), టాటా మోటార్స్ (1.15%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా టాటా స్టీల్ (-0.98%), అదానీ పోర్ట్స్ (-0.80%), జొమాటో (-0.54%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.21%) నిలిచాయి.