ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,832.66 పాయింట్ల (క్రితం ముగింపు 81,467.10) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత రోజంతా లాభపడుతూనే ఉంది. ఇంట్రాడేలో 82,002.84 గరిష్ట స్థాయిని తాకిన సూచీ, చివరికి 140.75 పాయింట్ల లాభంతో 81,607.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 16.50 పాయింట్లు లాభపడి 24,998.45 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.97గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.