స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 77,578 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 23,518 వద్ద స్థిరపడింది.టాప్ గెయినర్లు గా మహీంద్రా అండ్ మహీంద్రా (3.55%), టెక్ మహీంద్రా (2.28%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (2.21%), సన్ ఫార్మా (1.60%), టాటా మోటార్స్ (1.47%) నిలిచారు. టాప్ లూజర్స్ గా రిలయన్స్ (-1.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.44%), టాటా స్టీల్ (-1.31%), బజాజ్ ఫిన్సర్వ్ (-1.21%), మారుతీ (-1.13%) నిలిచారు.