దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది. మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ముగిశాయి. విప్రో, ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి.