నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు సెన్సెక్స్ 167 పాయింట్లు పతనమై 81,467 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 24,981 వద్ద స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 2,706 షేర్లు లాభాల్లో, 1,246 షేర్లు నష్టాల్లో, 97 షేర్లు మారలేదు. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.462 లక్షల కోట్లతో పోలిస్తే నేడు రూ.459 లక్షల కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్‌బిఐ, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ మరియు టిసిఎస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
నెస్లే, హెచ్‌యుఎల్, రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టిపిసి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.