దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. చివరికి సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 81,501 వద్ద ముగియగా.. నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 24,971 వద్ద ముగిసింది. మరియు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.03 వద్ద ముగిసింది.
నిఫ్టీ, ట్రెంట్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ నష్టాలను చవిచూడగా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో లాభపడ్డాయి.
సెక్టార్లలో ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, టెలికాం సూచీలు గ్రీన్‌లో ముగియగా, ఆటో, ఐటీ, ఫార్మా, మీడియా 0.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.