స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 23,453 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా స్టీల్ (2.39%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.37%), నెస్లే ఇండియా (1.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.20%) ఉన్నారు. టాప్ లూజర్స్ టీసీఎస్ (-3.05%), ఇన్ఫోసిస్ (-2.82%), ఎన్టీపీసీ (-1.56%), టెక్ మహీంద్రా (-1.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%) ఉన్నారు.