Stock markets : ఈరోజు స్టాక్ మార్కెట్లు (Stock markets) నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 72 పాయింట్లు కోల్పోయి 74,029 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 22,470 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్ గా ఇండస్‌ఇండ్ బ్యాంక్ (4.38%), టాటా మోటార్స్ (3.18%), కోటక్ బ్యాంక్ (2.45%), బజాజ్ ఫైనాన్స్ (1.77%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.60%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా ఇన్ఫోసిస్ (-4.28%), టెక్ మహీంద్రా (-2.80%), నెస్లే ఇండియా (-2.43%), TCS (-1.99%), HCL టెక్నాలజీస్ (-1.91%) నిలిచాయి.