Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets) ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 548 పాయింట్లు కోల్పోయి 77,311 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 23,381 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లు గా కోటక్ బ్యాంక్ (1.20%), భారతీ ఎయిర్‌టెల్ (0.90%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.48%), టెక్ మహీంద్రా (0.41%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (0.40%) నిలిచాయి. BSE సెన్సెక్స్‌లో టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.45%), టాటా స్టీల్ (-3.11%), జొమాటో (-2.87%), టైటాన్ (-2.83%), బజాజ్ ఫైనాన్స్ (-2.15%) నిలిచాయి.