Stock markets : శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో (Stock markets) ముగిశాయి. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల సెన్సెక్స్ 191.51 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 77,414.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 72.60 పాయింట్లు లేదా 0.31 శాతం తగ్గి 23,519.35 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ గా కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ మరియు నెస్లే ఇండియా అత్యధికంగా లాభపడ్డాయి. టాప్ లూజర్స్ గా సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, మారుతి సుజుకి మరియు ఇన్ఫోసిస్ అత్యధికంగా నష్టపోయాయి.