Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets) ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 76,759 వద్ద ముగిసింది. 226 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 23,249 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా భారతీ ఎయిర్‌టెల్ (2.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (1.82%), నెస్లే ఇండియా (1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.51%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా టాటా మోటార్స్ (-7.37%), ఐటీసీ హోటల్స్ (-4.98%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-2.12%), అదానీ పోర్ట్స్ (-1.86%), జొమాటో (-1.66%) నిలిచాయి.