Homeహైదరాబాద్latest NewsStock markets : ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు ఢమాల్.. 10 సెకన్లలో 20 లక్షల...

Stock markets : ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు ఢమాల్.. 10 సెకన్లలో 20 లక్షల కోట్ల గోవిందా

Stock markets : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఆసియా మరియు అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు గణనీయమైన నష్టాలకు దారితీశాయి, సెన్సెక్స్ 4,000 పాయింట్లు పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కేవలం పది సెకన్లలోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల డబ్బు ఆవిరైపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభ సెషన్‌లో సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు (5.22 శాతం) పడిపోయింది. ఆ సమయంలో, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 20,16,293.53 కోట్లు తగ్గి రూ. 3,83,18,592.93 కోట్లకు చేరుకుంది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 10 శాతం చొప్పున పడిపోయాయి.

Recent

- Advertisment -spot_img