Homeహైదరాబాద్latest Newsవైన్స్ షాపులలో స్టాక్ నిల్, బెల్ట్ షాపులలో ఫుల్

వైన్స్ షాపులలో స్టాక్ నిల్, బెల్ట్ షాపులలో ఫుల్

ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎక్సైజ్ అధికారి, ఎక్సైజ్ సీఐ అండతోనే బ్లాక్ దందా అంటున్న మందుబాబులు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలో ఉన్న 3 వైన్స్ షాపుల సిండికేట్ తో, వచ్చిన స్టాక్ లో 80 శాతం అన్ని రకముల బ్రాండ్ ల సరుకులను, పరిమిషన్స్ లేని మండలంలోని బెల్ట్ షాప్ లకు తరలింపు. బెల్ల్ షాపుల నుంచి కమీషన్లు వసూలు చేస్తూ, ఒక్క కేసు కూడా నమోదు చేయని ఎక్సైజ్ ఉన్నతాధికారులు. నాసిరకం బీర్లు ఏవైనా ఎమ్మార్పీ రేట్లపై 30, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు అదనంగా తగ్గేదేలే అన్నట్లుగా వసూలు. ఇష్టమైన బ్రాండ్లు దొరకవు, నో కూలింగ్, నో కామెంట్, ఇష్టముంటే కొను లేకపోతే వెళ్ళు. ఎక్కడ ఫిర్యాదు చేసుకో! ఏమి భయం లేదనే, రీతిలో వైన్ షాపుల తీరు?. ఇప్పటికీ వైన్ షాప్ ల ముందు ధరల పట్టికలను అమర్చకాపోవటానికి వాళ్ల ధైర్యం ఏమిటి?. యదేచ్చగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న, వినియోగదారులు అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకొని ఎక్సైజ్ ఉన్నతాధికారుల తీరు దేనికి సంకేతం?. వైన్ షాప్ లలో జరుగుతున్న బ్లాక్ దందాలకు , ప్రధానంగా ఎక్సైజ్ అధికారుల అండదండలే కారణమంటూ, గత 4 నెలలుగా గూడూరు మండల ప్రజలవాదన!. ఇవన్నీ పచ్చి నిజాలేనంటూ నిగ్గుతెచ్చిన, గూడూరు మండల బిజెపి అధ్యక్షుడు గుండెబోయిన మల్లేష్ యాదవ్, పార్టీ కార్యకర్తలు.స్ట్రాంగ్ బీర్లు కావాలంటే అడుగుతే లేవని హుకుం. తీరా చూస్తే 100 బాక్సుల స్టాక్ ఉంది. మూడు వైన్స్ షాప్ లో స్టాక్ ను గణేష్ వైన్స్ షాప్ లోనే భద్రపరిచి, బెల్ట్ షాపులకు విక్రయిస్తున్న తీరు, అన్ని రకాల బ్రాండ్లు ఉన్న కేవలం బెల్డు షాపులకే చేరవేత నిజమే. ఈ విషయంపై గూడూరు మండల ఎక్సైజ్ సీఐ బిక్షపతి కి ఫిర్యాదు చేసిన స్పందించని వైనం. మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చొరవ తీసుకొని, వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, గూడూరు మండల వినియోగదారుల ప్రజలు, బిజెపి మండలాధ్యక్షుడు గుండెబోయిన మలేష్ యాదవ్, కార్యకర్తలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img