ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, రాయుడిని ‘జోకర్’అని సంభోదించాడు. ఆ పదంతో రాయుడు పై ట్రోలింగ్ మొదలైంది. దీంతో పీటర్సన్ నేరుగా స్పందించాడు. ‘‘ఐపీఎల్ ఫైనల్ తర్వాత నేను, రాయుడు సరదాగా మాట్లాడుకున్నాం. అయితే, సామాజిక మాధ్యమాల్లో మాత్రం రాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం బాధాకరం. ప్లీజ్..ఇకనైనా ఆపండి’’ అంటూ పీటర్సన్ పోస్టు పెట్టాడు.