మన దగ్గర చాలామంది పిల్లిని అశుభంగా భావిస్తారు. కానీ కర్ణాటకలోని మాండ్య జిల్లా బెక్కలెలె గ్రామంలో మాత్రం పిల్లిని దైవంగా కొలుస్తారు. పిల్లి కోసం ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా జాతర కూడా నిర్వహిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఆచారం వెయ్యేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు ఆ గ్రామస్తులు. దుష్టశక్తుల నుంచి తమ గ్రామాన్ని కాపాడేందుకు మంగమ్మతల్లి పిల్లి రూపంలోకి ప్రవేశించిందని వారు నమ్ముతారు.