Homeహైదరాబాద్latest NewsStrange dismissal: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రనౌట్.. ఇలా అవుటయ్యాడేంటి..!(VIDEO)

Strange dismissal: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రనౌట్.. ఇలా అవుటయ్యాడేంటి..!(VIDEO)

Strange dismissal: క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రనౌట్‌. దురదృష్టవశాత్తు క్రీజులోనే ఉన్న బ్యాటర్ రనౌట్ అయ్యాడు. పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో ఈ వింత రనౌట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పాకిస్థాన్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ క్వైడ్ ఈ ఆజామ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సియాల్‌కోట్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ వలీద్ ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పెషావర్ బౌలర్ మహ్మద్ అమీర్ ఖాన్ వేసిన బంతిని మహ్మద్ వలీద్ డిఫెన్స్ చేశాడు.

ఈ బంతిని అందుకున్న బౌలర్ అమీర్ ఖాన్.. వికెట్ల వైపు బలంగా విసిరాడు. బ్యాట్స్ మెన్ మహ్మద్ వలీద్ తన కుడి కాలును పైకెత్తి బంతి తగులుతుందేమోనని పై గాల్లో ఎగిరాడు. ఆ సమయంలో బంతి వికెట్లను తాకింది. వెంటనే పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ చేత రివ్యూ కోరాడు. రీప్లేలను వివిధ కోణాల్లో పరిశీలించగా.. బంతి స్టంప్‌లను తాకినప్పుడు మహ్మద్ వలీద్ గాలిలో ఉన్నాడు. దీనితో మహ్మద్ వలీద్ దురదృష్టవశాత్తు రీతిలో రనౌట్ అయ్యాడు.

Recent

- Advertisment -spot_img