వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని తాళ్లకుంట తండాలో మనీ అనే రైతుకు వింత అనుభవం ఎదురైంది. పంటసాగుకు నీటి కొరత వేధిస్తుండడంతో బోరువేయాలని అనుకున్నాడు. తనకున్న వ్యవసాయ భూమిలో బోరు వేసే క్రమంలో మొదటి పాయింట్‌లో నీరు పడకపోవడంతో..రెండవ పాయింట్ వద్ద బోరు వేస్తున్నాడు. ఇంతలో మొదటి పాయింట్‌లో నీళ్లు ఎగసిపడ్డాయి. ఊహించని విధంగా నీళ్లు రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.