భద్రాద్రి ఆలయంలో వస్తోన్న వింత శబ్దాలతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆలయ తూర్పు మెట్ల నుంచి విమానం వెళ్తోన్నట్లుగా శబ్దం వస్తోంది. ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తోందో తెలియక భక్తులు భయపడుతున్నారు. తూర్పు మెట్ల సమీపంలో ఉన్న జలప్రసాదానికి నీరు సరఫరా చేసే క్రమంలో పైపుల మధ్య గాలి ఒత్తిడి పెరగడం వల్ల ఇలా శబ్దం వస్తూ ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే ఈ శబ్దం ఎక్కడినుంచి వస్తుందో కనుక్కొని వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.