వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంథనిలోని స్వర్ణపల్లిలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులు మానస(5), వేదాన్ష్(3), వెంకటాపూర్ లో గడ్డం మల్లేశ్ అతని కూతురిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.