Homeహైదరాబాద్latest Newsనకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏడిఏ నూతన్ కుమార్

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏడిఏ నూతన్ కుమార్

ఇదే నిజం, కంగ్టి: నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాప్ లైసెన్స్‌ రద్దు చేసి షాప్‌ సీజ్‌ చేస్తామని ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. బుధువారం కంగ్టి మండల కేంద్రంలో విత్తన దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి విత్తనాలు అమ్మకాల, బిల్లులను, రిజిస్టర్ లని తనికీ చేశారు. అనంతరం ఏడిఏ నూతన్ కుమార్ మాట్లాడుతూ..ఎమ్మార్పీ ధరలకన అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సరిపడా మోతాదులో వర్ష్యం కురిసిన తర్వతనే రైతులు వితుకోవాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేముందు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వంతో అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంటలు పూర్తయ్యే వరకు కొనుగోలు చేసిన రశీదులను భద్రపర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img