బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో ఫెంగల్ తుపాన్‌గా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కారైకాల్- మహాబలిపురం మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 55 నుంచి 77 కిమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.