తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న చివరి రోజు ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదురుతుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. పోరాటం తమకు కొత్త కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేశారని పేర్కొన్నారు. మీరు బూతులు తిట్టినా.. అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామన్నారు.