Homeజిల్లా వార్తలుగుడ్​ టచ్​.. బ్యాడ్ టచ్​​పై విద్యార్థులకు అవగాహన

గుడ్​ టచ్​.. బ్యాడ్ టచ్​​పై విద్యార్థులకు అవగాహన

– మంచిర్యాల జిల్లా షీ టీం ఎస్సై ఓబులమ్మ

ఇదే నిజం, లక్షెట్టిపేట: మహిళల రక్షణే షీ టీం కర్తవ్యమని మంచిర్యాల జిల్లా షీ టీం ఎస్సై ఓబులమ్మ తెలిపారు. పట్టణంలోని పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్​ టచ్, బ్యాడ్​ టచ్​ గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆకతాయిల నుంచి వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నంబర్ లో సంప్రదించాలని కోరారు. అత్యవసర సమయంలో డయల్ 100కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రావన్ కుమార్, కస్తుర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img