Homeహైదరాబాద్latest NewsStudents : విద్యార్థులకు శుభవార్త.. 12 వేలు రావాలంటే.. ఇలా చేయండి..!!

Students : విద్యార్థులకు శుభవార్త.. 12 వేలు రావాలంటే.. ఇలా చేయండి..!!

Students : కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తూ, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పథకాన్ని అమలు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు ఏటా రూ.12,000 చొప్పున స్కాలర్‌షిప్ అందించడం ద్వారా, 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్‌ను నివారించి, వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

అర్హత ప్రమాణాలు : వయస్సు 2025-26 విద్యా సంవత్సరంలో 13-15 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 8వ తరగతిలో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు సరిపోతాయి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ స్కాలర్‌షిప్ 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. 10వ తరగతిలో 60% మార్కులు సాధిస్తే ఇంటర్మీడియట్‌లో కూడా స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.

దరఖాస్తు : అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 31, 2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో అందుబాటులో ఉంటాయి.

Recent

- Advertisment -spot_img