ఇదే నిజం ఖానాపురం: నేడు వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల బుధురావ్ పేట విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల ఖానాపురం మండలం బుధరావుపేట విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాండ్ల సదాకర్ తెలియజేసారు. ద్వితీయ సంవత్సరం మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 86 గాను 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 92% తో ఉండడం జరిగింది అని అన్నారు. ప్రథమ సంవత్సరం మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 78 కి గాను 67 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
ద్వితీయ సంవత్సరం విద్యార్థులలో బైపిసి సెకండియర్ నందు మరిపెద్ది సాయి ప్రియ 971/1000, బుర్కా భావన 952 / 1000 గుణిగంటి శ్రీజ 951 /1000, ఎంపీసీ సెకండ్ ఇయర్ లో కందికొండ వర్షిత 964 /1000, రాగం విద్యశ్రీ 945 /1000, సిఇసి సెకండియర్ లో మండ త్రివేణి 809/1000, వంకార్ లయ 797/1000 మార్కులు సాధించడం జరిగింది.
ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ ఫస్టియర్ కు గాను సిగ్నామా శివదుర్గ 435 / 470, సింగు చందన 426/470, బైపిసి ఫస్టియర్ ఫలితాలలో బానోతు దివ్య 430 / 440, రాయరాకుల అక్షిత 416 / 440, మరియు సిఇసి ప్రథమ సంవత్సరం ఫలితాలలో
బొల్లికొండ శ్రీవల్లి 466 /500, గదర బోయిన మేఘన441/500, సాధించడం జరిగింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరినీ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.