Homeహైదరాబాద్latest Newsబీహార్‌ సీఎం ఇంటి ముందు విద్యార్థుల నిరసన

బీహార్‌ సీఎం ఇంటి ముందు విద్యార్థుల నిరసన

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) పరీక్షలో పేపర్ లీకేజీకి నిరసనగా పాట్నాలో విద్యార్థులు ఆదివారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అయితే, చర్చలు జరిగినప్పటికీ ఆందోళనకారులు నిరసన స్థలం నుంచి వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అంతకుముందు. సీఎం హౌస్ వైపు సాగుతున్న పాదయాత్రలో గాంధీ మైదాన్ సమీపంలోని జేపీ గోలంబార్ వద్ద విద్యార్థులు బారికేడింగ్‌ను బద్దలు కొట్టారు. అయితే, నిరసన తెలిపిన విద్యార్థులను తదుపరి భద్రతా బారికేడింగ్ వద్ద 100 మీటర్ల ముందు నిలిపివేశారు.

Recent

- Advertisment -spot_img