Homeహైదరాబాద్latest Newsకష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

ఇదేనిజం, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి తల్లిదండ్రులతోపాటు పాఠశాలకు పేరు తీసుకురావాలని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించాలని, వారి మార్గనిర్దేశంలో సాగితే కచ్చితంగా విజయతీరాలను చేరుతారని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో, సమయ సారిణిననుసరించి ప్రత్యేక శ్రద్ధతో చదివి,10 జీపీఏ సాధించాలని, ప్రణాళికతో కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హన్మంత్‌రెడ్డి, లక్ష్మారావు, శ్రీనివాసమూర్తి, అనురాధ, అనసూయ, సత్యనారాయణ, సతీశ్, చంద్రశేఖర్, కల్పన, శ్యాంసుందర్, అజ్మతుల్లా, కమలేకర్ నాగేశ్వర్‌రావు, పర్వతాలు, అజీమ్, అనిత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img